గ్రామాలలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి.

* మండల ప్రత్యేక అధికారి పద్మజ ఎంపీడీవో శ్రీనివాస్

పయనించే సూర్యుడు న్యూస్ 18 సాలూర : గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారిపద్మజ,ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో గ్రామాల సర్పంచ్ లు వారి వారి గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను అధికారులకు వివరించారు.సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.వేసవికాలం కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామాలలో ముందస్తుగా మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.సాలూర మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల పాటు వైద్య సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు నూతన భవన నిర్మాణ దృష్ట్యా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.గ్రామాలలో కొనసాగుతున్న మరియు నిర్వహిస్తున్న పనుల వివరాలను అధికారులు వివరించారు.ఈ సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి రాజీ మంజూష,సర్పంచ్ లు,పంచాయతీ కార్యదర్శులు,వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *