పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 18 మిడ్జిల్ రిపోర్టర్ బి శేఖర్ -ముచ్చెర్ల జనార్దన్ రెడ్డి రాష్ట్ర నాయకులు మిడ్జిల్ మండల అధ్యక్షుడు నరేష్ నాయక్ ఆధ్వర్యంలో చిల్వేర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ అరుణమ్మ సహకారంతో సీసీ రోడ్డు మంజూరైంది . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి గారు పాల్గొని సీసీ రోడ్డు యొక్క నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈరోజు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయంటే కేవలం బిజెపి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యం అని ఆయన అన్నారు. కావున భవిష్యత్తులో డబల్ ఇంజన్ సర్కార్ మన తెలంగాణలో కూడా బిజెపి ప్రభుత్వం రాబోతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శి వాసుదేవ్, శేఖర్, నరేష్, మండల ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు ఆంజనేయులు చిల్వేర్ గ్రామ ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, రామ్మోహన్, ప్రేమ్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.