పయనించే సూర్యుడు మార్చి 18 నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ భవన్ లో మంగళవారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు మరియు ముస్లిం ఉద్యోగస్తులకు ఇఫ్తార్ విందును ఇచ్చినట్లు టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు భావాండ్ల వెంకటేష్, జిల్లా కార్యదర్శి షర్ఫుద్దీన్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగ మిత్రులు సోదరులు పవిత్రంగా ఉంటారని,ఈ మాసంలో ఒకరోజు వారికి ఇఫ్తార్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కోశాధికారి బాలరాజు,జిల్లా కమిటీ సభ్యులు కొట్ర బాలాజీ, చెన్నకేశవులు,పి.కళ్యాణ్ కృష్ణారావు,జ.కే.వెంకటేష్, శ్రావణ్,కరిముల్లా,రహీం అహ్మద్ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ముస్లిం ఉద్యోగ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.