పయనించే సూర్యుడు మార్చ్ 18 (హైదరాబాద్ మాధవరెడ్డి ) టెలికాం రంగంలో సామాన్య వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కౌన్సిల్ ఫర్ సిటిజెన్ వాయిస్ స్వచ్చంద సంస్థ ప్రతినిధులు సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించారు. టెలికాం టారిఫ్ నిబంధనల 66,67వ సవరణలు అమలు చేయాలని మరియు ట్రాయ్ యాక్ట్ 1997 ప్రకారం వినియోగదారుల హక్కులను రక్షించాలని వారు కోరారు.ట్రాయ్ యాక్ట్ 1997 లోని సెక్షన్ 11(1)(బి ) ప్రకారం టెలికాం సేవల వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం అథారిటీ బాధ్యత అని సీసీవీ ప్రతినిధులు తెలిపారు. వినతిపత్రంలో ప్రధానంగా ఈ అంశాలను ప్రస్తావించారు: ఇన్కమింగ్ కాల్స్ కొనసాగింపు: రీఛార్జ్ వాలిడిటీ ముగిసిన వెంటనే ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేయడం వలన వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ కనీస సేవగా ఇన్కమింగ్ కాల్స్ కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వాయిస్ ఓన్లీ ప్లాన్లు టిటీఒ 66 & 67వ సవరణల స్ఫూర్తితో డేటా అవసరం లేని వినియోగదారుల కోసం సరసమైన ధరలో వాయిస్ ఓన్లీ ప్లాన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు 30 రోజుల వాలిడిటీ ప్లాన్లు ప్రస్తుతం ఉన్న 28 రోజుల ప్లాన్ల కారణంగా వినియోగదారులు సంవత్సరానికి 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోందని, అందువల్ల 30 రోజుల క్యాలెండర్ నెల వాలిడిటీ ప్లాన్లు అమలు చేయాలని కోరారు కాల్ డ్రాప్స్ నివారణ ప్రమాణాలను కచ్చితంగా అమలు చేసి కాల్ డ్రాప్ సమస్యలను తగ్గించాలని సీసీవీ డిమాండ్ చేసింది. ఫిర్యాదుల పరిష్కారం టెలికాం వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార నిబంధనల ప్రకారం వినియోగదారుల ఫిర్యాదులను నిర్ణీత గడువులో పరిష్కరించేలా పర్యవేక్షించాలని కోరారు ఈ సందర్భంగా సీసీవీ ప్రతినిధులు మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను కాపాడటం ప్రభుత్వ మరియు నియంత్రణ సంస్థల బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నరేష్ బాబు రామ్మోహన్ వెంకటేష్ సురేష్ మణికంఠ మల్లేశ్వరరావు మహేశ్వర్ రెడ్డి ఇతర సభ్యులు పాల్గొన్నారు