టైటిల్. ఖానాపూర్ మాజీ శాసనసభ్యులు అజ్మీర గోవింద్ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొన్న భూక్యా జాన్సన్ నాయక్.

పయనించే సూర్యుడు మార్చ్ 18 నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అజ్మీర గోవింద్ నాయక్ అంత్యక్రియల్లో మాజీ మంత్రివర్యులు జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ గోవింద్ నాయక్ భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గోవింద్ నాయక్ ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండే నిజమైన ప్రజానాయకుడని, ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి మృతి నియోజకవర్గ ప్రజలకు, రాజకీయ వర్గాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో గోవింద్ నాయక్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. గోవింద్ నాయక్ సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, ఆయన ప్రజాసేవా స్పూర్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *