పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 18 మామిడిపెల్లి లక్ష్మణ్ తెలంగాణ తత్వాన్ని అణువణువునా ఆవహించుకొని తన సాహిత్యంతో ఉద్యమానికి ఊపిరిలూదిన ప్రముఖ కవి, సాహితీవేత్త తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డి కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడంతో రాయికల్ పట్టణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు కు చెందిన తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ హర్షం వ్యక్తంచేశారు. నందిని సిధారెడ్డి కి వచన కవిత్వం విభాగంలో ఆయన రచించిన “అనిమేష” కవితా సంపుటికి గాను ఈ అవార్డు వరించిందని ఆయన తెలియజేశారు ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్ నందిని సిద్ధారెడ్డి రచించిన ప్రతిష్ఠాత్మక కవితా సంపుటి ‘అనిమేష’. కరోనా కాలంలో సమాజ పరిస్థితులను, ప్రకృతి ప్రాధాన్యతను ఇతివృత్తంగా తీసుకుని రచించిన ఈ దీర్ఘ కావ్యం, 2025 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకుంది. అనిమేష అంటే రెప్పవాల్చనిది (ప్రకృతి) అని అర్థం. కరోనా కష్టకాలంలో ప్రపంచం అనుభవించిన దుఃఖం, మానవ సంబంధాలు, ప్రకృతి రక్షణ గురించి 19 అధ్యాయాలుగా రాసిన కవితలు. ఈ కావ్యం ఆధునిక వచన కవిత్వంలో ఒక అద్భుత సృష్టిగా గుర్తింపు పొందింది. నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -‘అనిమేష’ కవితా సంపుటి. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులే వస్తువుగా అనిమేష కవితా సంపుటి సిధారెడ్డి వెలువరించారని అన్నారు.అనిమేష అంటే రెప్పలు వాల్చనిది. ప్రకృతి కూడా రాత్రింబవళ్లు రెప్పవాల్చకుండా మనిషిని కాపాడుకునే మాతృమూర్తిగా భావించి కవితా సంపుటికి ఆ పేరు పెట్టారని వివరించారు సిధారెడ్డి కి అవార్డు రావడం తెలంగాణకు, తెలంగాణ సాహిత్యానికి దక్కిన గౌరవమని అన్నారు తెలంగాణ ఔన్నత్యాన్ని, కష్టాలను, కన్నీళ్లను ప్రపంచానికి చాటిన కాలానికి దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. నాగేటి సాల్లల్ల నా తెలంగాణ అంటూ తన పాటలో ప్రతీ సాలు సాలుకు తెలంగాణ పరిమళాలు అద్దిన నందిని సిదారెడ్డి కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించబడిన శుభవేళ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు