నాగులవంచలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

పయనించే సూర్యుడు మార్చి 18, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి.గ్రామ సర్పంచ్ నారగాని రాంబాయి, గ్రామ కార్యదర్శి చిరంజీవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.మంగళవారం ఖమ్మం–బోనకల్ రహదారిపై రోడ్లపై మరియు కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి డంపింగ్ యార్డుకు తరలించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ నారగాని రాంబాబు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *