పయనించే సూర్యుని న్యూస్,మార్చి 18(ఏలేశ్వరం మండలం రిపోర్టర్ ఏ శివాజీ):ఏలేశ్వరం చైర్ పర్సన్ అలమండ సత్యవతి చలమయ్య పదవీకాలం ముగిసిన ప్రజలకు చేయాల్సిన సేవ ఇంకా మిగిలే ఉందని ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్పర్సన్ అలమండ సత్యవతి చలమయ్య వెల్లడించారు.సోమవారంతో నగర పంచాయతీ చైర్పర్సన్ పదవీకాలం ముగియడంతో వారి అభిమానులు అలమండ దంపతులను సత్కరించారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ సత్యవతి చలమయ్య మాట్లాడుతూ 1992లో పర్వత సుబ్బారావు దంపతుల ప్రోత్సాహంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించామన్నారు.అప్పటినుంచి ప్రజాసేవలో కొనసాగుతూ 2001లో ఏలేశ్వరం పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికై ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పంచాయతీ నీ అభివృద్ధి పదం వైపు నడిపించానన్నారు.అప్పటి ఎమ్మెల్యే పర్వత దంపతుల ప్రోత్సాహంతో పంచాయతీని సుందరంగా తీర్చిదిద్దామన్నారు.అలాగే అద్వాన్నంగా ఉన్న రోడ్లను సిమెంట్ రోడ్లుగా అభివృద్ధి చేసామన్నారు.ఏలేశ్వరం త్రాగునీటికి కేవలం ఒకే ఒక్క ట్యాంక్ పై ఆధారపడి ఉండగా తాము అధికారం చేపట్టిన తర్వాత ఏ ఎం జి వంటి స్వచ్ఛంద విద్యాసంస్థలు,మణిహంస పవర్ ప్రాజెక్ట్ సహకారంతో స్థానికంగా నీటి ఎద్దడి లేకుండా 2 రక్షిత మంచినీటి ట్యాంకులను నిర్మించడం జరిగిందన్నారు.అనంతరం 2019లో పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ప్రోత్సాహంతో నగర ప్రజలు తమకు చైర్మన్ పదవిని అప్పగించి తనపై మరింత బాధ్యతను పెంచారు అన్నారు.అప్పటినుండి నిరంతరం నగర అభివృద్ధికి కృషి చేస్తూ దిగ్విజయంగా ఐదు సంవత్సరాలు పదవీకాలం పూర్తి చేయడం జరిగిందన్నారు. కొన్ని రాజకీయ కారణాల దృశ్య తాను వైసీపీ నుండి తెలుగుదేశంలోకి చంద్రబాబు నాయుడు లోకేష్ ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరమన్నారు. ప్రత్తిపాడు శాసనసభకు పోటీ చేసిన వరుపుల రాజా సతీమణి సత్య ప్రభ ను అత్యధిక మెజారిటీతో విజయం సాధించేందుకు సాయ శక్తుల కృషి చేశామన్నారు.తను పదవి అలంకరించిన ఐదు సంవత్సరములలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయానని కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు.నగరంలోని పౌరుల నుండి వసూలు చేసిన పనులను ప్రభుత్వ ఖజానాకు కట్టాల్సిందే తప్ప సొంతంగా చైర్ పర్సన్ నిర్ణయం తీసుకుని చేసేదేమీ లేక నిత్యాహంతో మిగిలిపోయామన్నారు.ప్రభుత్వం తమకున్న వెసులుబాటును బట్టి నిధులు కేటాయిస్తే దానితోనే సర్దుకోవాల్సి వచ్చింది అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి డ్రైనేజీలు, రహదారులు వంటివి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.స్థానిక సంస్థలకు కనీసం స్థానిక సమస్యలపై స్పందించే ఎసులుబాటు కలిగినప్పుడే పూర్తిస్థాయిలో అభివృద్ధిపరిచేందుకు అవకాశం కలుగుతుందన్నారు.గ్రామ పరిపాలనకు అభివృద్ధికి సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం చైర్మన్ కి లేకపోవడం దురదృష్టకరమన్నారు. అలాగే అభివృద్ధి చేసిన పనులకు కూడా తొందరగా నిధులు మంజూరు కాకపోవడంతో పనులు పూర్తి చేసేందుకు గుత్తేదారులు ముందుకు రాకపోవడం మరో కారణంగా అని చెప్పారు.100 సంవత్సరాల చరిత్ర గల తన రాజకీయ కుటుంబంలో రాజకీయవారసుడిగా తాను నిరంతరము సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని, పదవి ప్రమేయం లేకుండా నిరంతరం ప్రజలకు తమ వంతుగా సాయి మన్నించేందుకు అలమండ నూకరాజు చారిటబుల్ ట్రస్ట్ సిద్ధంగా ఉందన్నారు. ఏలేశ్వరం మండల పరిధిలోని ఎవరికి ఏ కష్టం వచ్చినా తన తలుపు తడితే సాయి మందించేందుకు అపర్ణాష్టం అందించేందుకు నిరంతరం అందుబాటులో ఉంటామన్నారు. నగరాన్ని సుందరి గురించి ఎందుకు తన వంతుగా ప్రయత్నించిన కొన్ని రాజకీయ శక్తులు అడ్డుపడడంతో పనికి వేగాతం కలిగి కాస్త నిరుత్సాహాన్ని కలిగించిందని ఆయన మనోవేదన వ్యక్తం చేశారు. పదవి కాలం ముగిసిన తాను ఏలేశ్వరం ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవలో కొనసాగుతానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బోద చిరంజీవి, బూర్లు సత్తిబాబు,బూడి సూరిబాబు, సుంకర సుబ్బారావు,చల్లా గణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.