పయనించే సూర్యుడు మార్చి 18 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్. ఆదోని మండలం పెద్దతుంబలం పీహెచ్సీ ఆవరణలో సుమారు రూ.45 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ల్యాబ్ భవన పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణంలో ఉపయోగిస్తున్న సామగ్రి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు తెలిపారు.నిర్మాణ పనులు ప్రారంభమైన కొద్ది రోజులకే గోడల్లో పగుళ్లు కనిపించడం, సిమెంట్ మిశ్రమం బలహీనంగా ఉండడం వంటి అంశాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. పనుల నాణ్యతను అధికారులు సమీక్షించకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్య కేంద్ర భవనం నిర్మాణంలో నిర్లక్ష్యం చోటుచేసుకోవడం బాధాకరమని గ్రామస్తులు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిర్మాణ పనులను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అధికారులు కఠిన చర్యలు తీసుకుని పనులను సక్రమంగా పూర్తి చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.