పయనించే సూర్యుడు మార్చి 18 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఈరోజు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఒక విద్యార్థికి ల్యాప్‌టాప్‌ను అందజేశారు. తాడూరు మండలం పర్వతాయపల్లి గ్రామానికి చెందిన సాంబ కవిత, ఇబ్రహీంపట్నంలోని శ్రీ దత్త గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో బి.టెక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని. ఆమె విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించే భాగంగా ఈ ల్యాప్‌టాప్‌ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేటి ప్రపంచంలో పెన్నుతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఎంతో ముఖ్యమని, విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను అలవర్చుకుని తమ భవిష్యత్తును మరింత బలంగా నిర్మించుకోవాలని సూచించారు. కుటుంబానికి, గ్రామానికి, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని తెలిపారు.