ప్రకృతి వ్యవసాయం వైపు రాయపల్లి రైతుల అడుగులు

* పెట్టుబడి లేని వ్యవసాయమే లక్ష్యం _రాజపూర్ రైతు వేదికలో రైతులకు శిక్షణ * జీవామృతం, బీజామృతం వంటి సహజసిద్ధమైన ఎరువులతో అధిక దిగుబడి * 'నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్' కింద కిట్ల పంపిణీ

పయనించే సూర్యుడు మార్చి 18, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజపూర్ మండలంలోని రాయపల్లి గ్రామం కేంద్ర ప్రభుత్వ ‘నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’ పథకానికి ఎంపికైంది. ఇందులో భాగంగా బుధవారం రాజాపూర్ రైతు వేదికలో రాయపల్లి గ్రామ రైతులకు ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం (ఓరియంటేషన్ ప్రోగ్రామ్) నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ.. రసాయన ఎరువులు లేకుండా, సాంప్రదాయ పద్ధతుల్లో పండించే ప్రకృతి వ్యవసాయాన్ని  ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.జీవామృతం, బీజామృతం వంటి సహజసిద్ధమైన ఎరువుల వాడకం తో అధిక దిగుబడి వస్తుందన్నారు.అనంతరం రైతులకు ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన ‘నేచురల్ ఫార్మింగ్ కిట్స్’ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్, ఉప సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ , వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీనివాసులు, మండల పంచాయతీ అధికారి వెంకట్ రాములు, పంచాయతీ కార్యదర్శి రవి ప్రకాష్, కారోబార్ నర్సిములు , వార్డు సభ్యులు, గ్రామానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *