‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 2వ వార్డులో పారిశుద్ధ్య పనులు వేగవంతం”

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 18 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మున్సిపల్ పరిధిలో పట్టణ అభివృద్ధి, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం కింద 2వ వార్డులో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్ ఆదేశాల మేరకు మంగళవారం వార్డులోని ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చి మొక్కలను ట్రాక్టర్లు, డోజర్ల సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ప్రధాన లక్ష్యమని, ప్రజలు కూడా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్, మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *