ప్రభుత్వ అనుమతులు లేకుండా రంగురంగుల కాగితాలు, రాళ్లతో

ప్రజలను ఆకర్షిస్తున్న అక్రమ వెంచర్ల పై చర్యలు తీసుకోవాలి....సిపిఎం.

పయనించే సూర్యుడు మార్చి 18 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్ ఆదోని పట్టణం విస్తరిస్తున్న తరుణంలో ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగురంగుల కాగితాలు ముద్రించి ప్రజలను మభ్యపెడుతూ ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఆకర్షణీయమైన వెంచర్లు వేస్తూ వ్యాపారం చేస్తున్న వెంచర్ల యజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, తిప్పన్న, మండల కార్యదర్శి లింగన్న, మున్సిపల్ కమిషనర్ నయీమ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వీరు మాట్లాడుతూ పట్టణంలోని నలుమూలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తు కొత్త కొత్త వెంచర్లు ఎస్టేట్ల పేర్లతో విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా ఉంటున్నారని వారు తెలిపారు. దీంతో పట్టణంలో నిత్యం కబ్జాల పేరుతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని వారు తెలిపారు .కావున ఇప్పటికైనా సంబంధం అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ అనుమతులు లేకుండా పట్టణంలో అక్రమ వెంచర్లు వేసి ధనార్జన దేయంగా ప్రజలను మభ్యపెడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *