పయనించే సూర్యుడు న్యూస్, పెద్దపల్లి, సెంటినరీ కాలనీ :-18 గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి యువ కార్మికుడు భార్గవ్ ఇటీవల ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పటికే భర్త, పెద్ద కుమారుడిని కోల్పోయిన తల్లి… ఇప్పుడు మిగిలిన ఒక్క కొడుకు కూడా చనిపోవడంతో గుండెలవిసేలా విలపిస్తోంది.ఈ విషాద ఘటన స్థానికులను కదిలించింది. ఈ నేపథ్యంలో మంగళవారం శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.భార్గవ్ తల్లిని ఓదార్చి, ఆమెకు బియ్యంతో పాటు నెలసరి నిత్యావసర సరుకులు అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ… సమితి సభ్యులు ప్రతి నెలా కొంత మొత్తం జమ చేసి అవసరమైన వారికి సహాయం అందిస్తున్నామని తెలిపారు.ఈ సేవా కార్యక్రమానికి తోడ్పడుతున్న ప్రతి సభ్యుడికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అట్లూరి శశికళ, కంది సుజాత, గాదం సరితలక్ష్మి, ఇమ్మడి శారద, కొప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.