బోయిని పేట, దుబ్బగూడెం, గొల్ల గూడెం లలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమము.

మంథని మున్సిపల్ చేర్మెన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 18 మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్,ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమములో భాగంగా మున్సిపల్ చైర్మన్ శ్రీ ఒడ్నాల శ్రీనివాస్ ఈ రోజు మంథని మున్సిపల్ పరిధిలోని బోయిని పేట, దుబ్బగూడెం, గొల్ల గూడెం లలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమము. నిర్వహించారు. ఈ కార్యక్రమములో ముండ్ల పొదలు తొలగించి మురికి కాలువలు, రోడ్లను శుభ్రం చేయించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతు అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమములోమున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు జంబోజు సమ్మయ్య, పోలు శివ, గుండా రాజు, నక్క నాగేంద్ర, అట్టెం రాజు, సబ్బని సమ్మయ్య, నడిపి రాజు మరియు ప్రజలు పాల్గొన్నారు.