పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 18 . చండూర్ మున్సిపాలిటీలో ఆదివారం బిజెపి కార్యకర్తలపై జరిగిన దాడికి నిరసనగా చండూరు పట్టణంలో వ్యాపార సంస్థలు బంద్ చేయించిన బిజెపి నాయకులు. బంద్ లో పాల్గొన్న రాష్ట్ర ప్రధానకార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్,బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు గంగిడి మనోహార్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పథకం ప్రకారం గతంలో హెచ్చరించిన మాదిరిగానే నిన్న దాడి చేశారు,ఈ దాడిని ప్రజాస్వామ్యం నమ్మే యావత్ ప్రజాస్వామ్యాన్ని నమ్మేట్టు ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నడూ జరిగి ఉండవు. ఇది పథకం ప్రకారము బిజెపి కార్యకర్తలను హత్య చేయడానికి ప్లాన్, మున్సిపల్ ఎలక్షన్లు జరిగి నెల రోజులు కాకముందుకే చండూరులో గుండా రాజకీయాలు మొదలయ్యాయి, కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రావాలని నిన్న బిజెపి బంధు ప్రకటించింది దానికి అనుగుణంగా చండూరు మున్సిపాలిటీ ప్రజలు స్వచ్ఛందంగా బందు పాటించారు దానికి భారతీయ జనతా పార్టీ తరఫున చండూరు మున్సిపాలిటీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.