పయనించే సూర్యుడు మార్చి తేదీ 18 రూలర్ బి బాస్ అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రి గుడా మండలం గుంట గన్నేల పంచాయతీ పిత్త గుడా గ్రామానికి చెందిన కిల్లో బలరాం 49 సంవత్సరలు ఈ రోజు ఉదయం మిరియాలు కోయడానికి నిచ్చెన పట్టుకొని తోటకూ వెళుతున్న సమయంలో నిచ్చెన కరెంట్ వైర్ కు తగిలి,విద్యుత్ షాక్ తో అక్కడిక్కాకడె మృతి చెందారు. మృతి చెందిన బలరాం కుటుంబానికి తక్షణమే 10 లక్షలు నష్ట పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. అలాగె కాఫీ మిరియాలు రైతులకు ప్రత్యక్షంగా ఇన్సూరెన్సు చదుపాయం కల్పించాలి. కాఫీ రైతులకు సేఫ్ గర్డ్స్ లేక చెట్టు నుండి పడిపోవడం,పాము కాటుకు, వన్య ప్రాణులు నుండి దాడులు ఎదుర్కొని తోట పనులు చేస్తున్నారు. ప్రమాద వసత్తు ఇటువంటి సంఘటనలు జరిగిన్నప్పుడు మృతి చెందిన కుటుంబానికి భారం అవుతున్నారు. అరకు ఆర్గానిక్ కాఫీ, మిరియాలకు విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యతలు కలిగి ఉంది.అంత గిరాకీ ఉన్న ఇక్కడ కాఫీ, మిరియాలు పండించే రైతులకు మాత్రం ప్రభుత్వం భరోసా కల్పించే ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం బాధాకరం, రోజు కాఫీ రైతులు ఏదొక ప్రమాదంతో మరణిస్తూ ఉన్నారు. రైతులకు చెల్లించాల్సిన ప్రోత్సహక నిధులు ఇప్పటికి చెల్లించడం లేదు. ఒక వైపు కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో కాఫీ తోటలా అభివృద్ధికి కోట్లు ఖర్చు చేస్తున్నాము.అని ప్రకటనలు చేస్తున్నారు. సంవత్సరల తరబడి రైతులకు చెల్లించాల్సిన కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే, విడుదల చేసిన డబ్బులు ఎవరి జేబులోకి వెళుతున్నాయో అర్ధం కాని పరిస్థితి రైతుల్లో వ్యక్తం అవుతుంది. అనేక మార్లు కాఫీ రైతులకు, తోటలకు ఇన్సూరెన్సు కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించిన ప్రభుత్వం స్పందించక పోవడం వలన తోటల పై ఆధారపడి జీవిస్తున్న గిరిజన కుటుంబాలు అనాధలు అవుతున్నారు.ఇప్పటి కైనా ప్రభుత్వం స్పందించి మృతి చెందిన కిల్లో బలరాం కు నష్ట పరిహారం అందించి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకోవాలని జాతీయ కాఫీ రైతు సంఘం నాయకులు గెమ్మెలి చిన్న బాబు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.