ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

ఏఐటీయూసీ డిండి మండల అధ్యక్షులు బుసిపాక లింగమయ్య

పయనించే సూర్యుడు మార్చ్ 18( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గ్రామపంచాయతీ కార్మికులను అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం కాకుండా ప్రభుత్వం, పోలీసులు ముందస్తు అరెస్టు లతో ఉద్యమాలను ఆపలేరని వారు అన్నారు. నేటికీ గ్రామపంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై అనేకసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయిన పట్టించుకోకుండా రెండు నెలలు, మూడు నెలల, పెండింగ్ జీతాలను బడ్జెట్ రిలీజ్ అయిన జీతాలు కొట్టకుండా జాప్యం చేస్తున్నారని ,మల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేసి మాకు కనీస వేతనం 26000 వేలు అందించాలని, ప్రతినెల 5వ తారీఖు లోపు నేరుగా అకౌంట్లోకి జీతాలు జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గ్రామపంచాయతీలలో కార్మికులకు మాస్కులు, బ్లౌజులు ,బూట్లు, డ్రెస్సులు, నూనెలు, ఎక్కడ కూడా ఇవ్వడం లేదని ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయిన అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. కార్మికులకు పని భారం పెంచుతూ ఆదివారం కూడా సెలవు లేకుండా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేయిస్తున్నారని తక్షణమే వీక్లీ ఆపు ఇవ్వాలని, మా సమస్యలు పరిష్కరించని, ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ప్రభుత్వం మర్చిపోయి నత్త నడకన నడుస్తుందని మాపై సవితి తల్లి ప్రేమను చూపిస్తుందని విఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షులు లింగమయ్య ,రామవత్ జోహార్ లాల్, ఆంజనేయులు ,జగతయ్య, బాలరాజ్ ,పెంటయ్య ,
రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *