ముళ్ళకంపలను తొలగించి అగ్ని ప్రమాదాలు నివారించండి.

ఆదోని అధికారులకు నూర్ అహ్మద్ విజ్ఞప్తి

పయనించే సూర్యుడు మార్చి 18 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ ఆదోని పట్టణం మరియు శివారులలో పెరిగిన ముళ్ల కంపల వల్ల ప్రస్తుతం వేసవిలో అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి కావున పురపాలక మరియు పంచాయతీ అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని, ముళ్ళ చెట్లను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ కోరారు. ముళ్ల కంపల వల్ల తరచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నేడు ఆయన ఆదోని యం.ఐ.జి. కాలనీలో పర్యటించి జ్యోతిర్మయి డిగ్రీ కళాశాల వెనుక ఉన్న సెల్ టవర్ల చుట్టూ ప్రమాదకరంగా పెరిగిన ముళ్ల పొదలను పరిశీలించారు. వేసవిలో చెత్త చెదారం ముళ్ల పొదలను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా అగ్ని ప్రమాదాలను, గాలి ద్వారా వ్యాప్తి చెందే రోగాలను నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు నూర్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. ఎ. నూర్ అహ్మద్ హెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *