పయనించే సూర్యుడు : మార్చి 18 జడ్చర్ల తాలూకా బాలానగర్ మండల రిపోర్టర్ రేవల్లి కృష్ణ మంగళవారం మేరా యువ భారత్ కేంద్ర ఆధ్వరంలో బాలనగర్ మండలంలోని చింతకుంట తండా మరియు వివిధ గ్రామాల్లో మేరా యువ భారత్ జిల్లా అధికారి కోట నాయక ఆదేశాల మేరకు యూత్ క్లబ్ డెవలప్మెంట్ క్యాంటీన్ నిర్వహించడం జరిగింది. మేరా యువ భారత్ కేంద్ర వాలంటరీ ఎస్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ యువత చైతన్యం పొందిన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. అలాగే యువత సంఘాలుగా ఏర్పడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరడం జరిగింది.సంఘాలు ఏర్పడిన తర్వాత మేరా యువ భారత జిల్లా యువజన కార్యాలయంలో అనుబంధం చేసుకోవాలని సూచించారు. ఇలా సంఘాలు ఏర్పాటు చేయడం వల్ల గ్రామంలో సామాజిక సేవలు చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల యువకులు పాల్గొన్నారు.