రైతన్న మీకోసం కార్యక్రమంలో అన్నదాత సుఖీభవపై అవగాహన

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 18 రిపోర్టర్ అభి పెద్దకడబూరు మండలం చిన్నతుంబళంలో నిర్వహించిన “రైతన్న మీకోసం” కార్యక్రమంలో భాగంగా టీడీపీ మండల అధ్యక్షుడు మల్లిఖార్జున, సొసైటీ చైర్మన్ నరసప్ప ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు మూడు విడతల్లో రూ.20 వేల ఆర్థిక సాయం అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహులు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.