ర్యాష్ డ్రైవింగ్‌తో హల్చల్ చేస్తున్న యువకులు

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలి

పయనించే సూర్యుడు మార్చి 18 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం: జిల్లా వ్యాప్తంగా కొంతమంది యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. సైలెన్సర్ లేని బైక్స్, నెంబర్ ప్లేట్స్ లేని బైక్స్‌తో రోడ్లపై వేగంగా తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ బైక్స్ అధిక శబ్దంతో తిరుగుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు.రోడ్లపై వేగంగా బైక్స్ నడపడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. దీంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లలు, వృద్ధులు రోడ్డు దాటేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు.సైలెన్సర్ తొలగించిన బైక్స్ వల్ల భారీ శబ్దం వినిపిస్తూ కాలనీల్లో నివసించే ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. నెంబర్ ప్లేట్స్ లేకుండా తిరుగుతున్న బైక్స్ కారణంగా ఏదైనా ప్రమాదం జరిగినా గుర్తించడం కష్టమవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సైలెన్సర్ లేని బైక్స్, నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై కేసులు నమోదు చేసి కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.