వత్సవాయి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా బుర్రి వెంకట్ ఏకగ్రీవ ఎన్నిక – పాత్రికేయుల నుంచి హర్షం

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 18 వత్సవాయి మండలంలో నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్‌గా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు బుర్రి వెంకట్ ని మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండలంలోని పాత్రికేయుల సమావేశం నిర్వహించి, అందరి సమ్మతితో ఈ నిర్ణయం తీసుకున్నారు. జర్నలిజం రంగంలో ఎన్నో సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేస్తూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, వార్తా రంగానికి విశేష సేవలు అందిస్తున్న బుర్రి వెంకట్ కి ఈ పదవి దక్కడం పట్ల పాత్రికేయులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ, బుర్రి వెంకట్ ఎప్పుడూ నిజాయితీతో వార్తలను ప్రజలకు చేరవేస్తూ, జర్నలిస్టుల సమస్యలపై కూడా ముందుండి పోరాడుతున్నారని పేర్కొన్నారు. మండలంలోని అన్ని మీడియా ప్రతినిధులను ఐక్యంగా ఉంచి, ప్రెస్ క్లబ్ అభివృద్ధికి కృషి చేయగల సామర్థ్యం ఆయనకు ఉందని అభిప్రాయపడ్డారు. నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బుర్రి వెంకట్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన ప్రతి పాత్రికేయుడికి కృతజ్ఞతలు తెలిపారు. మండ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *