విత్తనాలను విత్తుకున్న ఎడల నేల సత్తువను తేమశాతాన్ని కాపాడుతుంది ఏవో

పయనించే సూర్యుడు మార్చి 18 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మున్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం రైతన్న మీకోసం కార్యక్రమము ఆయా గ్రామాల గ్రామ వ్యవసాయ సహాయకుల ఆధ్వర్యంలో జరిగింది. మడపల్లి చేజర్ల గ్రామాలలో జరిగిన కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హిమబిందు పాల్గొన్నారు ఏటూరులో జరిగిన కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొని 32 రకాల విత్తనాలను విత్తుకున్న ఎడల నేల యొక్క సత్తువను తేమశాతాన్ని కాపాడుకోవచ్చని వ్యవసాయ రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సందేశం తో కూడిన కరపత్రాలను రైతుల ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు