విలాసాగర్ గ్రామంలో రైతు వేదికలో ప్రకృతి వవ్వసాయం పై అవగాహన సదస్సుకు

ముఖ్యఅతిథిగా హాజరైన విలాసాగర్ సర్పంచ్ ఏనుగుల కనకయ్య

పయనించే సూర్యుడు మార్చి 18 కరీంనగర్ న్యూస్: విలాసాగర్ గ్రామంలోని రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయం పై అవగాహన సదస్సు గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య, ఉపసర్పంచ్ పొత్తూరి శైలజ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిపుణులు రైతులకు ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత, రసాయన రహిత సాగు విధానాలు, తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందే పద్ధతులపై వివరించారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏనుగుల కనకయ్య, ఉపసర్పంచ్ పొత్తూరి శైలజ రాజు, గ్రామ వార్డు సభ్యులు గోల్కొండ సూరి, కొంకటి సతీష్, దయ్యాల రేణుక, దమ్మ వెంకట రమణ, జోగు శంకర్, గంగాధర శ్రీకాంత్, సుంకపాక అనిల్ మరియు మండల వ్యవసాయాధికారి ప్రణీత, ఏ.ఈ.వో రజిత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి సారవంతం పెరిగి, ఆరోగ్యకరమైన పంటలు పండుతాయని నిపుణులు తెలిపారు.