వేములవాడ ఫైర్ స్టేషన్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాల పైన అవగాహన కార్యక్రమం

పయనించే సూర్యుడు మార్చ్ 18 (గణేష్ టౌన్ రిపోర్టర్ వేములవాడ :99 రోజుల ప్రజాపాలనలో భాగంగా వేములవాడ ఫైర్ స్టేషన్ ఇన్చార్జి, ఫైర్ ఆఫీసర్ సిహెచ్ శంకర్ ఆధ్వర్యంలో వేములవాడ కిడ్స్ కాన్వెంట్ హై స్కూల్లో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మనం తీసుకోవాల్సిన చర్యల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు తగు సూచనలు చేశారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ సిహెచ్ శంకర్, ఎఫ్ ఎఫ్ టీ ఎమ్ దుర్గ రాజ్, ఎఫ్ ఎఫ్ ఎమ్ రాజేశ్వర్, ఎఫ్ ఎఫ్ ఏ శేఖర్, పి. ఈ. టీ చేకూర్తి నవీన్,స్కూల్ టీచర్స్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు