వైకుంఠ దామానికి దారి శుభ్రం – పాలెం గ్రామంలో విస్తృత స్వచ్ఛత కార్యక్రమం

పయనించే సూర్యుడు మార్చి 18 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో ఈరోజు వైకుంఠ దామం (స్మశాన వాటిక)కు వెళ్లే మార్గంలో ఉన్న కంప చెట్లు, చెత్త చెదారం తొలగిస్తూ శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ పనులు నిర్వహించారు. అలాగే మెయిన్ రోడ్డులో బి.ఎస్.ఎన్.ఎల్ కార్యాలయం నుండి సైనిక్‌పురి కాలనీ వరకు రోడ్డుకు అడ్డంగా పెరిగిన కంప మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, రామకృష్ణ ఉపసర్పంచ్ శ్రీనివాసులు, మాజీ సైనికులు వెంకటయ్య గ్రామ సెక్రటరీతో పాటు 6వ వార్డు సభ్యులు పాల్గొని తమ బాధ్యతలను నిర్వర్తించారు.