వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యవసాయ యాంత్రీకరణ

పయనించే సూర్యుడు: మార్చి 18/26 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె .విజయబాబు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతులను పాటించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం లోని సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు, పెనుబల్లి ,తల్లాడ మండలాలకు సంబంధించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2025-2026 ద్వారా రాయితీ పనిముట్లను ఆయన పంపిణీ చేశారు.ఐదు మండలాల్లోని లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీపై రోటవెటర్స్, బేయిలర్స్,స్ప్రేయర్స్లు పంపిణీ చేశారు..ఈ సందర్భంగా డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయం లాభసాటిగా లేదని, పెట్టుబడి భారమవుతుందని తెలిపారు.అందుకే ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రోత్సాహం అందిస్తోందన్నారు.ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో సాంకేతిక, యాంత్రీకరణ మార్పులు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి,సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ దారావత్ మోహన్ నాయక్, సత్తుపల్లి ఏఎంసి వైస్ చైర్మన్ గొర్ల వెంకటప్ప రెడ్డి,సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు,వ్యవసాయశాఖ అధికారులు,రైతులు,తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *