పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 18 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ ఎన్నికల ముందు సఫాయి కార్మికులకు అమలు చేస్తామని ఇచ్చిన హమిని ప్రభుత్వం,రెండు సంవత్సరాలు గడిచినా అమలు చేయకపోవడం అన్యాయమని సీఐటీయూ మండల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మాకు కనీస వేతనంతో పాటు, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంగళవారం చలో సెక్రటేరియట్ కు వెళ్లుతున్న మండలం లో ఉన్నా అన్ని గ్రామ పంచాయతీ కార్మికులను చేగుంట పోలీసులు ముందస్తు అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.ఈ కార్యక్రమంలో నందు, వెంకటేష్, గణేష్,శ్రీకాంత్,సాయమ్మ, లక్ష్మి, నవీన్, కృష్ణ,సువర్ణ, పోచమ్మ, ఆంజనేయులు, జ్యోతి,లలిత, కొండి పోచమ్మ, మైసమ్మ, స్వామి,వడ్డెర బెల్లం కృష్ణ,చంద్రం, కృష్ణ, ఎర్ర బాలయ్య దాదా రాములు, బుదయ,షాదుల్లా,సంపత్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.