పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 18 బోధన్ : రంజాన్ పండుగను పురస్కరించుకొని ఉపవాస దీక్షల సందర్భంగా మంగళవారం సాలూరలో సాయి నగర్ కాలనీలో మైనార్టీ సోదరులకు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సింగాడి పాండు, సింగాడి అనిల్ బ్రదర్స్ ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బోధన్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, అడ్వకేట్ ఈశ్వర్ శంకర్ గ్రామ పెద్దలు ఇళ్తేపు శంకర్, గంగారం, కేజీ గంగారం శివకాంత్ పటేల్ హాజరై ఉపవాస దీక్షలు చేపట్టిన మైనార్టీ సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షలను విరమింపజేశారు. ముస్లిం సోదరులు సింగడి పాండుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ యువకులు చిన్నారులు సాలుర గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు