స్వయంభు శ్రీ గుండుమల్లన్న స్వామి ఉగాది జాతర ఉత్సవాలు

పయనించే సూర్యుడు 18-3-2026 గొల్లపెల్లి మండల రిపోర్టర్ ( ఆవుల చందు ) తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని తిరుమలాపురం (పిడి) గ్రామంలో గల స్వయంభు శ్రీ గుండు మల్లన్న స్వామి వారి ఉగాది ఉత్సాహాలు ఆలయంలో నేటి నుంచి జరుగు జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడును.ఈనెల 18న బుధవారం నుండి 20న శుక్రవారం వరకు మూడు రోజులపాటు జరుగు జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి రోజు ఉదయం 8 గంటల నుండి స్వామివారి ఉత్సవ మూర్తులతో శోభయాత్ర,మధ్యాహ్నం ఎడ్లబండ్ల పోటీలు,ఎడ్ల బండ్ల పోటీలో గెలుపొందిన వారికి. మొదటి బహుమతి రూ. 21116, రెండవ బహుమతి రూ.11116, మూడవ బహుమతి రూ.6116, దాతలు అందజేయగలరని ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు.19న ఉదయం స్వామివారి గోదావరి స్నానం, పచ్చని పందిరి, ప్రత్యేక పూజలు. సాయంత్రం ఎడ్లబండ్ల శోభయాత్ర. సాయంత్రం ఒగ్గు కథ కాలక్షేపం.20న ప్రత్యేక పూజలు, శ్రీ గుండుమలన్న స్వామి,వారి పట్నాలు బోనాలు.మధ్యాహ్నం మహా అన్నప్రాసన. సాయంత్రం,అగ్ని గుండాల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగును. ఈ సందర్భంగా మండలంలోని భక్తులు,అధిక సంఖ్యలో పాల్గొని,స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని.ఆలయ కమిటీ అధ్యక్షులు ఉస్కేమల్ల లచ్చయ్య ,ఆలయ కమిటీ సభ్యులు,గ్రామ ప్రజలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *