పయనించే సూర్యుడు న్యూస్, మార్చి18 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ):ఏలేశ్వరం పట్టణంలో క్వారిపేటలో ఉన్న స్వామి దయానంద ఆశ్రమానికి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వాగు సుజాత 4వేల రూపాయలు విలువ చేసే హాట్ బాక్స్,రాతికింద వెంకట కృష్ణారావు బ్రదర్స్ 3వేల రూపాయల విలువ చేసే సీలింగ్ ఫ్యాన్,గొల్లపూడి త్రిమూర్తులు విద్యార్థులకు పెన్నులు అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వాగు రాజేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజేష్ మీడియాతో మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆశ్రమానికి హాట్ బాక్స్ ఫ్యాను అందజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి సాయం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ఉభయగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ గొల్లపూడి త్రిమూర్తులు, సిహెచ్సి చైర్మన్,ఆర్యవైశ్యుల మండల అధ్యక్షుడు వాగు రాజేష్, నరసింహ, ఊర నానాజీ,వీరబాబు, బాబా,కటకం కిరీటి, బుజ్జిబాబు, స్కూల్ చైర్మన్ శ్రీను,వాగుబద్రిష్, వాగు రాకేష్, డొక్కా సీతమ్మ సేవా సంస్థ సభ్యులు సిరి ఫుడ్ కృష్ణ, కుర్ర గోవిందు, హాస్టల్ వార్డెన్ నల్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.