హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

★ బోధన్ భాజాపా మండల అధ్యక్షుడు సిర్ప సుదర్శన్

పయనించే సూర్యుడు న్యూస్ 18 బోధన్ : హామీల అమల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని పింఛన్లు అర్హులైన లబ్ధిదారులకు అందడం లేదని దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్లు మంజూరు చేయాలని భూభారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని బోధన్ భాజపా మండల అధ్యక్షుడు సిర్ప సుదర్శన్ డిమాండ్ చేశారు హామీలు అమలు చేయాలని కోరుతూ బోధన్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు అనంతరం తహసిల్దార్ విట్టల్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షులు మాజీ అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు