హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేస్తున్న బిజెపి నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 18 బోధన్ : బోధన్ పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సహించదు తెలంగాణ కార్యక్రమాన్ని బీజేపీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు మరియు ఇతర హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ బోధన్ పట్టణ అధ్యక్షుడు పసులోటి గోపి కిషన్, మాజీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక బాలరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నర సంవత్సరాలు పూర్తయినా కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వితంతు మరియు దివ్యాంగులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా వంటి పథకాలను అర్హులైన పింఛన్ లబ్ధిదారులను ప్రతి ఒక్కరికీ వెంటనే అందజేయాలని వారు డిమాండ్ చేశారు.అలాగే ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి, కళ్యాణలక్ష్మి తులం బంగారం, రైతు భరోసా, విద్యార్థినులకు స్కూటీలు వంటి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, వాటిని వెంటనే అమలు చేయాలని నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ భాజాప సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *