
పయనించే సూర్యుడు మార్చి 18 కరీంనగర్ న్యూస్: సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ పట్టణం హౌసింగ్ బోర్డ్ లో హిందూ సమ్మేళనం నిర్వహించడానికి కమిటీని ఏర్పాటు చేశారు.శ్రీ యజ్ఞవరాహస్వామి హిందూసమ్మేలనసమితి గా ఈ కమిటీ కి ఈ సందర్భంగా నామకరణం చేశారు. పుర ప్రముఖులు చందాసుధాకర్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. కమిటీ కి అధ్యక్షులుగా చొల్లేటి రమేష్ ,కార్యదర్శి గాబూట్ల పవన్ కుమార్ , కోశాధికారిగా గండ్ర సత్యనారాయణమహిళా ప్రముఖులుగా బండపల్లి ఉదయ తదితరులను ఎన్నుకున్నారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విభాగ్ సహవ్యవస్తాప్రముఖ్ దావులూరి మురళీధర్ మాట్లాడుతూ హిందూ సమ్మేళన ఆవశ్యకత , ఎందుకు నిర్వహించుకోవాలనే విషయంపైన అవగాహన కల్పించారు చొల్లేటి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బస్తీ ప్రముఖ్ కూనాడి రాంరెడ్డి ,మండల కార్యవాహ మాదాసు విక్రమ్ , మండలవ్యవస్తాప్రముఖ్ తాడెంఐలయ్య , శాఖా కార్యవాహ ఎం లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.