99 రోజుల ప్రజా పాలన విజయవంతం చేయాలి:కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపు

పరిశుభ్రతతోనే ఆరోగ్యం:99 రోజుల కార్యక్రమంపై కలెక్టర్ దృష్టి ప్రజలు అధికారులు కలిసి పనిచేస్తేనే విజయం సాధిస్తామని కలెక్టర్ అన్నారు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 18 సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా:జిల్లాలో అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. మంగళవారం హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్,వైస్ చైర్మన్ మల్లికార్జున్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుండి తడి చెత్త,పొడి చెత్తలను వేర్వేరుగా,చేసి మున్సిపల్ సిబ్బందికి ఇవ్వాలని సూచించారు. పట్టణ పరిశుభ్రత కోసం మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు వార్డుల్లో పర్యటించి, చెత్త తొలగింపు, డ్రైనేజీలు శుభ్రపరచడం, రోడ్ల పరిశుభ్రత వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా అందంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి పని చేయాలని తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నంత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అక్కడి సదుపాయాలను పరిశీలించారు, కిచెన్ షెడ్డు, త్రాగునీరు, టాయిలెట్స్, వంటశాల పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 6వ తరగతి విద్యార్థులతో తెలుగు పాఠం చదివించి గణితం చేయించారు, విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. స్కూల్ ప్రాంగణంలో శిథిలావస్థలో ఉన్న గదుల పై విచారణ జరిపి, వాటిని తొలగించి కొత్త నిర్మాణం చేపట్టాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ తహసిల్దార్ కవిత, ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డి, కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.