అన్నపూర్ణ అమావాస్య సందర్భంగా అన్నదానం.మెట్ పల్లి లో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలు..

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మార్చ్ 19 మెట్ పల్లి పట్టణంలోని పాత మండల పరిషత్ కార్యాలయంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ అధ్యక్షులు పుల్ల జగన్ గౌడ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మైలారపు రాంబాబు, పుల్ల జగన్ గౌడ్ మరియు పుల్ల శ్రీనివాస్ గౌడ్‌లను శాలువాతో సన్మానించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజ సేవలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ప్రజలు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.