పయనించే సూర్యుడు ప్రతినిధి చింతూరు, మార్చి 19 (న్యూస్) పోలవరం జిల్లా ఎటపాక లక్ష్మిపురం పిహెచ్సి వైద్యాధికారి మురళీ కృష్ణ గత నాలుగు నెలలుగా అగ్రవర్ణ దురహంకారంతో అధికార దుర్వినియోగనికి పాల్పడుతూ విధినిర్వర్తన పేరిట ఎఫ్ఎన్ఓ ఒక ఆదివాసీ మహిళ కాక సమ్మక్కని అనేకరకాలుగా వేదింపులకు గురించేస్తున్నారని హింసిస్తున్నారని చింతూరు ఐటీడీఏ పి ఓ, స్థానిక ఎం ఎల్ ఏ, జిల్లా కలెక్టర్ లకు విన్నవించిన తరువాత కూడా వేధింపులు ఆపకపోగా రోజు రోజుకీ మరింత చిత్ర వదకి గురించేస్తున్నారని అధికారుల చుట్టూ అబాగ్యురాలు తిరుగుతున్నా జిల్లా స్థాయి అధికారులు, స్థానిక ఎం ఎల్ ఏ తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం అని, సైకో డాక్టర్ విషయంలో జిల్లా స్థాయి అధికారుల, స్థానిక ఎం ఎల్ ఏ అండ దండలు తక్షణం ఆపాలని, చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వీడి, ఆదివాసీ మహిళా ఉద్యోగినిని వేదిస్తున్న డా. మురళీ కృష్ణ ని వెంటనే ఏజెన్సీ ప్రాంతం నుండి పంపించి వేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి చింతూరు డివిజన్ ఛైర్మెన్ జల్లి నరేష్ డిమాండ్ చేశారు.