పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి .19.2026 ఆదివాసులకు అందించే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ మరియు ఉపాధి, ఉద్యోగ నియమకాల్లో సింగిల్ విండో విధానం అమలు చేయాలని. ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సెంట్రల్ గవర్నమెంట్ అందించే పథకాలలో పోస్ట్ ఆఫీస్ లలో, విద్యా శాఖ,వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ,గిరిజన సంక్షేమ శాఖ మొదలైన శాఖల అధికారులు సిబ్బంది. ప్రజల నుండి బయోమెట్రిక్ థంబ్లు తీసుకోవటానికి మరియు డాక్యుమెంట్స్ సేకరించడానికి ఆదివాసీలకు సింగిల్ విండో విధానం. లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఫోన్ సిగ్నల్స్ లేక, పదేపదే థంబ్లు వేయాలన్న డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలన్న ఆదివాసీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి. ఆదివాసీ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఆదివాసీ ప్రజలకు సింగల్ విండో విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు