పయనించే సూర్యుడు, మార్చి 19, బూర్గంపాడు మండలం రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షన్ మిషన్ గ్రామీణ్ లో భాగంగా పాల్వంచ డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు తడి చెత్త పొడి చెత్త ప్రమాదకర చెత్త మరియు వర్మి కంపోస్ట్ ఎలా తయారవుతుంది అనే విషయం మీద అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహనలో భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి డంపింగ్ షెడ్ వరకు ర్యాలీగా వెళ్లి డంపింగ్ షెడ్ లో వర్ని కంపోస్ట్ తయారు గురించి సింగిల్ యూస్ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలు గురించి తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడం గురించి ఎస్పీఎం నుంచి వచ్చిన రేవతి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్డిఓ రవి బూర్గంపాడు ఎంపీడీవో జమాల్ రెడ్డి గ్రామపంచాయతీ సర్పంచ్ గుండి బాబురావు, ఉపసర్పంచ్ మహంకాళి రామారావు, పాలకవర్గం సభ్యులు దుర్గ,లక్ష్మి, బత్తుల శిరీష, కరం సామ్రాజ్యం,కార్యదర్శి స్పందన, ఏపీఓ,ఈసీ టి ఏ లు ఎఫ్ఎలు,కళాశాల ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ పాల్గొనడం జరిగింది.