పయనించే సూర్యుడు మార్చి 19 రిపోర్టర్ కామని ప్రమోద్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండల కేంద్రం అధికార కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన సర్పంచ్లకు ఒక న్యాయం ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ సర్పంచులకు ఒక న్యాయమా..? అంటూ మండల పరిషత్ కార్యాలయం ముందు బైఠాయించిన సర్పంచులు ఉపాధి హామీ పథకం కింద ఒక గ్రామంలో ప్రజల శ్రమను మరో మరొక గ్రామ అభివృద్ధికి కేటాయించడం ఎమ్మెల్యేకు తగునా ? ఉపాధి హామీ పథకంలో కష్టపడ్డ కార్మికులు ప్రజల శ్రమను గ్రామ యూనిట్ గా చేసి మెటీరియల్ కంపౌంటెంట్ కింద అదే గ్రామ పంచాయతీ అభివృద్ధికి కేటాయించాలని నినాదాలు ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే దీనికి వత్తాసు పలుకుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి కలెక్టర్ ఈజిఎస్ పిడి తక్షణమే వచ్చి హామీ ఇవ్వాలని కూర్చున్న సర్పంచులు సర్పంచుల మండల ఫోరం అధ్యక్షులు మాడ్రాజు వెంకన్న ప్రధాన కార్యదర్శి ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖానాపురం మండలంలోని 21 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం 9 గ్రామ పంచాయతీలకు ఉపాధి హామీ పథకం లోని లేబర్ కాంపోనెంట్ కింద గ్రామాల అభివృద్ధి కోసం మెటీరియల్ కాంపోనెంట్ కింద వచ్చే అభివృద్ధి నిధులను పక్క గ్రామాలకు మళ్ళించడం అన్యాయమని అన్నారు అభివృద్ధి నిధులు వస్తాయని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద ప్రజలతో గ్రామస్తులతో కలిసి దినసరి కూలీలను పెంచి ఉపాధి హామీ పనులను చేస్తే మా గ్రామాల ప్రజల కూలీల శ్రమ ద్వారా వచ్చిన నిధులను పక్క గ్రామాలకు మళ్లించడం ఎంతవరకు తగును అని ప్రశ్నించారు ఉపాధి హామీ పనుల్లో గ్రామాల వారిగా గ్రామస్తులు పడిన కష్టాన్ని స్థానిక ఎమ్మెల్యే డివిజన్ యూనిట్ గా మార్చి గ్రామాల అభివృద్ధికి గండికొడుతూ అధికార పార్టీ సర్పంచులు గెలిచిన వారికే కేటాయించడం ద్వారా ఎమ్మెల్యే అభివృద్ధి ఏంటో స్పష్టంగా అర్థమవుతుందని మండిపడ్డారు గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధి హామీ చట్టాన్ని అధికార పార్టీ నాయకులు చేతుల్లోకి తీసుకుంటుంటే తప్పుపట్టాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు జిల్లా కలెక్టర్ ఈజీఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వెంటనే స్పందించి ఏ గ్రామంలో కార్మికులు దినసరి కూలీలు ప్రజలు కష్టపడటం ద్వారా వచ్చిన నిధులను ఆ గ్రామ అభివృద్ధికి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచులు బాదావత్ జ్యోతి- బాలకిషన్ బానోత్ వీరన్న బాదరపోయిన నరేష్ గొంది సుజాత-నాగేశ్వరరావు కూస రమ-లింగమూర్తి పాల్గొన్నారు
