ఏఐపీకేఎంఎస్ ప్రధమ మహా సభను జయప్రదం చేయాలి.

★ సాలూరలో కరపత్రాల ఆవిష్కరణ.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 19 సాలూర: అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని జిల్లా నాయకులు సిహెచ్ రమేష్ పిలుపునిచ్చారు. మహాసభలకు సంబంధించిన కరపత్రాలను బుధవారం సాలూర మండల కేంద్రంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి విడుదల చేశారు. మహాసభలు 20వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ భవన్ లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభలలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడం కొరకు చర్చించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ మహాసభకు ఏఐపీకేఎంఎస్ ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో నాయకులు దేవయ్య,లాలయ్య,సాయిలు,గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.