కర్నూలు జిల్లాలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.

జిల్లా కలెక్టర్ సిరి ప్రారంభించారు కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ

పయనించే సూర్యుడు మార్చి 19 ఆదోని డివిజన్ రిపోర్టర్ గుమ్మాల బాలస్వామి. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ మంచి నిర్ణయాన్ని ఆమె అభినందించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందడంతో పాటు వారి దైనందిన జీవితంలో మరింత సులభతరం అవుతుందని తెలిపారు.ఈ సందర్భంగా దివ్యాంగులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వం తరఫున మరింత సహాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్ ఎం , కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు , బొందలీ చైర్మన్ విక్రమ్ సింగ్ దివ్యాంగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప,డైరెక్టర్లు, మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *