కుమ్మన్ పల్లిలో నేలనొరిగిన మొక్కజొన్న పంట పరిశీలన.

* పంటను పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారి శ్వేత.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 19 సాలూర : వడగండ్ల వాన కురియడంతో సాలూర మండలం పలు గ్రామాలలోని వ్యవసాయ క్షేత్రాలలో పండించిన మొక్కజొన్న పంట నేలనొరిగింది. ఈ సందర్భంగా బుధవారం మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమ్మన్ పల్లి రైతులతో కలిసి నేల నలిగిన పంటను పరిశీలించారు. పంట నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తామని ఏవో రైతులకు తెలిపారు.పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని పంట నష్టానికి సంబంధించి నివేదికలను ప్రభుత్వానికి తక్షణమే పంపించి పంట నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు మొక్కజొన్న రైతులు విన్నవించారు. రైతులు వారి వారి పంట వివరాలను అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేందర్ రెడ్డి,రైతులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *