కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలి.

* కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడులను సింగరేణిలో అమలు చేయవద్దనీ కోరుతూ వినతి.

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ -19 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడులను సింగరేణిలో అమలు చేయవద్దని కోరుతూ గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం( ఐ ఎఫ్ టి యు ) ఆధ్వర్యంలో ఆర్ జి 3. జనరల్ మేనేజర్ మధుసూదన్ గారికి వినతి పత్రం అందించారు.ఈ కార్యక్రమంలో గోదావరి బొగ్గు గాని కార్మిక సంఘం (ఐ ఎఫ్ టి యు) రామగుండం రీజియన్ ప్రధాన కార్యదర్శి ఈ రామకృష్ణ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కార్యదర్శి ఏ వెంకన్న లు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడుల సింగరేణిలో అమలు చేయవద్దని ఈ లేబర్ కోడల వల్ల కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం కలుగుతుందని అన్నారు. కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కు వేతనాల పెంచుకునే హక్కు సమ్మె చేసే హక్కు తదితర హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని ఈ యొక్క నాలుగు లేబర్ కోడులను ప్రభుత్వం వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి ఎల్ బి కే ఎస్ రాష్ట్ర నాయకులు చింతల శేఖర్, పి శేఖర్. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *