కొడకండ్ల ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయండి

మంత్రి దామోదర నరసింహం కోరిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పయనించే సూర్యుడు మార్చి 19 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహని పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి హైదరాబాద్ లోని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు ముఖ్య అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సదుపాయాల అభివృద్ధి దిశగా తీసుకోవాల్సిన చర్యలను మంత్రి కి వివరించారు ప్రత్యేకంగా కొడకండ్ల మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుతం కేవలం 7 పడకలతో మాత్రమే సేవలు అందిస్తున్నదని, పెరుగుతున్న జనాభా, రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఆ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాల్సిన అత్యవసరత ఉందని ఎమ్మెల్యే వివరించారు. ఈ మార్పు వల్ల ప్రాంతీయ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, అత్యవసర పరిస్థితుల్లో సమీప ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గుతాయని తెలియజేశారు ఎమ్మెల్యే విజ్ఞప్తిని శ్రద్ధగా విన్న మంత్రి దామోదర రాజనరసింహ సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో చర్చించి ఆసుపత్రి అప్గ్రేడేషన్‌కు అవసరమైన చర్యలు తీసుకుంటానని, మంజూరుకు పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారుఈ సందర్భంగా యశస్విని రెడ్డి మంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫున మరింత సహకారం అందించాలని కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *