చంపినోడే సంతాప సభ పెట్టినట్లుంది ప్రభుత్వ తీరు: వెలుగుమట్ల ఘటనపై ఎమ్మెల్సీ తాతా మధు ఫైర్!!

పయనించే సూర్యుడు మార్చి 19 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులందరికీ ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ డిమాండ్ చేశారు,ఈ మేరకు బుధవారం శాసనమండలిలో జరిగిన చర్చలో ఆయన వెలుగుమట్ల అంశాన్ని ప్రస్తావించారు,ఈ సందర్భంగా మాట్లాడుతూ,గత ఫిబ్రవరి 24న వెలుగుమట్లలో పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం అత్యంత బాధాకరమని అన్నారు ఇందిరమ్మ రాజ్యం అని చెబుతున్న ప్రస్తుత ప్రభుత్వం, పేదలు తమ నివాసాలను కనీసం మానవత్వం లేకుండా పేదల గుడిసెలను కూల్చడం సరికాదని విమర్శించారు,బీఆర్ఎస్ పార్టీ మరియు ఇతర ప్రతిపక్షాల పోరాటం ఫలితంగా ప్రభుత్వం కొంత మేర దిగివచ్చి,బాధితులకు ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రకటించడం, కొంత మేరకు ఆహ్వానించదగ్గ పరిణామమే అయినప్పటికీ,అది పూర్తిస్థాయిలో లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు,ఇచ్చిన ఇండ్ల పట్టాలలో కూడా డెబ్బై, ఎనబై మంది బోగస్ లబ్ధిదారులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోందని దానిపై విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు వెలుగుమట్ల ఘటనలో మొత్తం 1895 మంది బాధితులు ఉండగా, ప్రభుత్వం కేవలం 311 మందికి మాత్రమే పట్టాలు ఇచ్చి చేతులు దులుపు కోవడం సరైన పద్ధతి కాదని,బాధితులందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి, పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని,ఇళ్ల కూల్చివేత వల్ల పేదలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని మూటగట్టుకున్నారని,వారి ఇళ్లకు జరిగిన నష్టానికి గాను ప్రభుత్వం తగిన నష్టపరిహారాన్ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు,”చంపినోడే సంతాప సభలు పెట్టినట్లు” ఇళ్లను కూల్చివేసి, ఇప్పుడు మళ్ళీ పట్టాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు,పేదల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని,ప్రభుత్వం చిత్తశుద్ధితో అందరు బాధితులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు