చిన్న పీరు తండాలో పశువులకు గాలికుంటు టీకాల కార్యక్రమం

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మునీందర్ నాయక్ డాక్టర్ జీవిత

పయనించే సూర్యుడు మార్చి 19 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ ఈరోజు చిన్న పీరు తండాలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 49 ఎద్దులు, ఆవులు మరియు దూడలకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మునీందర్ నాయక్, ఉప సర్పంచ్ మీటియా, పశువైద్య డాక్టర్ జీవిత జ్యోతి, అజముద్దీన్, గోపాలమిత్ర వెంకటస్వామి మరియు సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా గ్రామ రైతులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై టీకాల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పశువులను వ్యాధుల నుంచి రక్షించేందుకు ఇటువంటి టీకాలు ఎంతో అవసరమని అధికారులు తెలిపారు. రైతులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ పశువులకు టీకాలు వేయించుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *