పయనించే సూర్యుడు న్యూస్ 19 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ తెలుగు నూతన సంవత్సరాది పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ మెదక్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ ఉగాది పచ్చడిలాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుతూ ఈ ఉగాది మీ కష్టాలకు ముగింపు మీ విజయాలకు ఆరంభం కావాలని కోరుకుంటూ తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా పరాభవ నామ సంవత్సరం లో ఆధ్యాత్మిక భావన పరిడ విల్లాలని మనలో మంచి మార్పుకు పరాభవ సుగమం పలకాలన్నారు ఈ సంవత్సరం అన్నిరంగాల్లోఈ యేటా వర్షాలు సమృద్ధిగా కురువాలని, రైతులు ఆనందంతో పాడి పంటలతో వర్ధిల్లాలన్నారు. అన్నింటా శుభం జరగాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు. ఈ కొత్త సంవత్సర పర్వదినం అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకున్నారు