జగన్నాధ్ పూర్ లో గ్రామ బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 19 మామిడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం జగన్నాధపూర్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం. చందన ఆధ్వర్యంలో, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తం 16 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేయబడింది. గ్రామ సభలో పిల్లల హక్కులను కాపాడడం, వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా కమిటీ పనిచేయాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎం. చందన మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో బాలల సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అలాగే గ్రామంలో బాలికల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రమాదకర పరిస్థితులను తొలగించాలని, గర్భిణీలు తప్పనిసరిగా సంబంధిత శాఖల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. పుట్టిన పిల్లలకు టీకాలు వేయించడం, ప్రతి పిల్లవాడిని పాఠశాలలో చేర్పించడం, డ్రాప్‌అవుట్స్ లేకుండా చూడడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న నేరాల నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పిల్లల హక్కులకు భంగం కలిగితే లేదా ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 కు లేదా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లల కోసం రూపొందించిన ఆడియో క్లిప్‌ను ఆవిష్కరించారు. అనంతరం అంగన్‌వాడి కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రాజ్‌కుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు శివకుమార్, సీడీపీఓ మమత, రూరల్ సీఐ సుధాకర్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి హరీష్, డిహెచ్ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ కొండయ్య, సూపర్వైజర్ అనూహ్య, గ్రామ సర్పంచ్ పరాచ శంకర్, ఉప సర్పంచ్ కుర్ర మల్లయ్య, గ్రామ కార్యదర్శి మౌనిక, ఐకేపీ సీఏ దేవరావు, స్కూల్ హెడ్‌మాస్టర్ శ్రీనివాస్, అంగన్‌వాడీ టీచర్, గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *